
కాంగ్రెస్ (congress), బీజేపీ (bjp) ఎమ్మెల్యేలకు సబ్జెక్ట్ తెలీదని, అందుకే అసెంబ్లీ సమావేశాల్లో వారు ఏం మాట్లాడుతున్నారో కనీసం వారికి కూడా అర్థం కావడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) ఆరోపించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ (assembly)లోని మీడియా పాయింట్ (media point) వద్ద మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ (komatireddy brothers) ఇద్దరు ఉదయం పూట సీఎం కేసీఆర్ (cm kcr) ను పొగుడుతారని, సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi)ని కలుస్తారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రధాని మెప్పు పొంది ఇద్దరు అన్నదమ్ములు బీజేపీలో చేరేందుకే ఆయనను కలిశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూమి నుంచి అంతరిక్షం వరకు ప్రతి అంశంలోనూ స్కామ్ లు చేశారని తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్కాములనీ, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానివి స్కీములని అన్నారు. కాంగ్రెస్ లో సీఎం అంటే కరెప్షన్ మ్యాన్ అని, తమ సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు.
కోమటిరెడ్డి ఇద్దరు అన్నదమ్ములను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆరుగురు సభ్యులని, అందులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతారని తెలిపారు. నిన్న సోనియాగాంధీ (sonia gandhi) మాట్లాడుతూ అమరీందర్ సింగ్ (amarinder singh)ను అప్పుడే జైలుకు పంపిస్తే బాగుండేదని బాధపడ్డారని జీవన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ లో రాత్రి 12 గంటల వరకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ట్రిపుల్ ఆర్ (RRR) అంటూ సినిమా పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. త్రిపుల్ ఆర్ అంటే రెచ్చగొట్టడం, రచ్చచేయడం, రెచ్చిపోవడం అని జీవన్ రెడ్డి నిర్వచనం చెప్పారు.
91,400 మంది నిరుద్యోగులు బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగస్వామ్య కావాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ పడుతున్నాయని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీల జెండాలు మ్యూజియంలో పెడతారని తెలిపారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు (mla raghunandan rao) స్పీకర్ ని ఆ సమయంలోనే వేడుకుంటే నేడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉండేదని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపారు.