కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక: ముగిసిన అభిప్రాయ సేకరణ, ఢిల్లీకి ఠాగూర్

By Siva KodatiFirst Published Dec 12, 2020, 7:54 PM IST
Highlights

టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ ముగిసింది. నాలుగు రోజుల పాటు మొత్తం 160 మంది అభిప్రాయాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్. 

టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ ముగిసింది. నాలుగు రోజుల పాటు మొత్తం 160 మంది అభిప్రాయాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్.

గత కొద్దిరోజులుగా ఇదే పనిలో బిజీగా వున్న ఆయన.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు.

వీటి ఆధారంగా ఒక నివేదిక తీసుకుని ఠాగూర్ ఢిల్లీ వెళ్లారు. ఈ అభిప్రాయాల నుంచి ఎవరిని టీపీసీసీ చీఫ్‌గా చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సీనియర్లేకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

అందరి ఏకాభిప్రాయం మేరకే ఎంపిక జరగాలని.. తమ అభిప్రాయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలన్నారు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎవరు పీసీసీ చీఫ్ అయినా తనకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. 
 
click me!