రాహుల్‌తో రేవంత్ రెడ్డి భేటీ: తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

By narsimha lodeFirst Published Sep 8, 2021, 4:36 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలు బుధవారం నాడు భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు బుధవారం నాడు భేటీ అయ్యారు.తెలంగాణ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత నూతన ఆఫీస్ బేరర్లతో రాహుల్ గాంధీ ఇవాళ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించనున్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆనాడు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది.  తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడ తెలంగాణలో రెండు దఫాలు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం  చేసుకోవాలని  ఆ పార్టీ ఇప్పటి నుండే అడగులు వేస్తోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళిత గిరిజన దండోరా పేరుతో సభలను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో  పార్టీ ని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో రాహుల్ చర్చిస్తున్నారు.


 

click me!