పీసీసీలో నో ఛాన్స్: సభ్యత్వ నమోదుపై నేతలకు రేవంత్ వార్నింగ్

By narsimha lodeFirst Published Jan 26, 2022, 1:20 PM IST
Highlights

కాంగ్రెస్ సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోని నేతలకు పార్టీ నాయకత్వం వార్నింగ్ ఇచ్చింది. పీసీసీలో చాన్స్ దక్కదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

హైదరాబాద్: Congress పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొందరు సీనియర్లు లైట్ గా తీసుకొన్నారు. దీంతో పార్టీ నాయకత్వం సీరియస్ అయింది.  Membership నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని నేతలకు అధిష్టానం షోకాజ్ లు పంపింది. చ ర్యలు కూడా తీసుకొంటామని హెచ్చరించింది.

సంస్ధాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఆయా Districts అధ్యక్షులు, నియోజకవర్గాలకు కూడా పార్టీ నాాయకత్వం  టార్గెట్ లు విధించింది.ద అయితే సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కావొస్తున్నా కూడా కొందరు నాయకులు సభ్యత్వ నమోదుపై స్పందించడం లేదు. సభ్యత్వ నమోదును లైట్ గా తీసుకొన్నారు.

ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా పార్టీ నాయకులు కొందరు డుమ్మా కొట్టారు. దీంతో  సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన నేతలకు కాంగ్రెస్ నాయకత్వం Show cause నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31న నిర్వహించే సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి హాజరు కావాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచించింది. ఈ సమావేశానికి రాకపోతే PCC లో ఛాన్స్ ఇవ్వబోమని పీసీసీ నాయకత్వం తేల్చి చెప్పింది. మరో వైపు 2018లో అసెంబ్లీకి  పోటీ చేసిన నేతలు తమకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేయకపోతే పీసీసీలో చోటు దక్కదని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చింది.

ఆరు రోజుల క్రితం పార్టీ సభ్యత్వ నమోదుపై Revanth Reddy సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరించిన వారిని రేవంత్ రెడ్డి అభినందించారు. Online లో  558 మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించిన మిర్యాల సుమంత్ ను రేవంత్ అభినందించారు. శశికాంత్  532 మందికి సభ్యత్వం ఇప్పించారు. వీరిని సమీక్షా సమావేశంలోనే రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ను కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. ఇవాళ్టితో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గడువు పూర్తి కానుంది. రాష్ట్రం నుండి 30 లక్షల మందిని సభ్యులుగా చేర్పిస్తామని రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి Shabbir Ali సుమారు 400 మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించారు. మాజీ మం్రి చిన్నారెడ్డి సుమారు 20 వేల మందికి  పార్టీ సభ్యత్వం ఇప్పించారు. ప్రతి మండలంలో 15 వేల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించాలని రేవంత్ రెడ్డి టార్గెట్ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల మందికి పార్టీ సభ్యత్వం ఇప్పించేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని  రేవంత్ పార్టీ నాయకులను కోరారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 3.5 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించాలని కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.

click me!