కేసీఆర్‌కు తొలిసారి ఓటమి భయం, ఆ బాధతోనే కేటీఆర్ ప్రెస్ మీట్: రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 25, 2021, 5:47 PM IST
Highlights

మూడు చింతలపల్లి గ్రామానికి ఇచ్చిన హామీలలో వేటీని నెరవేర్చలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గ్రామంలో అభివృద్ది, ఇచ్చిన హామీలకు సంబంధించి చర్చకు రమ్మంటే ఏ ఒక్కరు పట్టించుకోలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ తన అవసరాన్ని తీర్చుకోవడానికి దత్తత పేరు వరాల జల్లు కురిపిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి ఆరోపించారు. బుధవారం మూడు చింతలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరంను దత్తత తీసుకుని సీఎం దగా చేశారని రేవంత్ ఎద్దేవా చేశారు. మూడు చింతలపల్లి గ్రామానికి ఇచ్చిన హామీలలో వేటీని నెరవేర్చలేదన్నారు. గ్రామంలో అభివృద్ది, ఇచ్చిన హామీలకు సంబంధించి చర్చకు రమ్మంటే ఏ ఒక్కరు పట్టించుకోలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన సగం జోకర్, సగం బ్రోకర్ అంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో భూములు అమ్మినా, కొన్నా  మల్లారెడ్డికి కమీషన్ ఇవ్వాల్సిందేనని రేవంత్ వ్యాఖ్యానించారు. భూకబ్జాలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నాడని ఆయన ఆరోపించారు. జవహర్ నగర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి వుందని .. మంత్రి మల్లారెడ్డి కోడలు పేరిట ఆసుపత్రి కట్టాడని రేవంత్ ఆరోపించారు. మల్లారెడ్డి అల్లుడు ఔటర్ రింగ్ రోడ్డ్ పక్కనే చెరువు పక్కనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టాడన్నారు. 

కేసీఆర్‌కు తొలిసారి ఓటమి భయం పట్టుకుందని.. అందువల్లే కేసీఆర్‌ హామీలు కురిపిస్తున్నారంటూ రేవంత్ మండిపడ్డారు. 20 ఏళ్లు అధికారం అన్నప్పుడే కేసీఆర్‌కు ఓటమి ఖాయమైంది. టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ తర్వాత ఎవరూ మీడియా ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఆవేదన చూసి కేటీఆర్‌ మీడియా సమావేశం పెట్టారని... తాను నిన్న రాత్రి బస చేసిన ఇల్లు ఇందిరమ్మ కాలానిదన్నారు. మూడుచింతలపల్లిలో కేసీఆర్‌ హామీలు అమలు కాలేదని.. దళితబంధు అందరికీ ఇవ్వాలనేదే మా డిమాండ్ అన్నారు. దళితబంధుకు నిధుల కోసం ఏదైనా అమ్మేద్దామని.. దళితబంధు కోసం సచివాలయం, అసెంబ్లీ అమ్ముదాం. జీహెచ్‌ఎంసీలో వరద బాధితులను కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని ఇవ్వలేదని.. రూ.10 వేలే ఇవ్వలేదని, రూ.10 లక్షలు ఇస్తారా అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.  

click me!