తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీ హోదా: ఉత్తర్వులు జారీ

By narsimha lodeFirst Published Aug 25, 2021, 4:59 PM IST
Highlights

తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీలుగా ఉన్న నలుగురిని డీజీపీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతిని కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.ఐపీఎష్ అధికారులు అంజనీకుమార్, రవిగుప్తా, గోవిండ్ సింగ్, ఉమేష్ ఫ్రాప్  లకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

అంజనీకుమార్, రవిగుప్తా, గోవిండ్ సింగ్ లు  1990 బ్యాచ్ అధికారులు. ఉమేష్ ఫ్రాప్ 1989 బ్యాచ్ అధికారి.  నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా తెలంగాణ ప్రభుత్వం  ఉత్తర్వులిచ్చింది.

ఇవాళే సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాాత నలుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతిని కల్పించింది.ఈ నలుగురు ఐపీఎస్ అధికారులకు అదనపు డీజీపీ హోదా నుండి డీజీపీ హోదా లభించింది.


 

click me!