ఆంధ్రావాళ్ల పైసలతో టీఆర్ఎస్ పెట్టారు.. టీడీపీ సహాయంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే.. మీరు పరాన్నజీవులు: రేవంత్ ఫైర్

Published : Jul 15, 2023, 06:09 PM IST
ఆంధ్రావాళ్ల పైసలతో టీఆర్ఎస్ పెట్టారు.. టీడీపీ సహాయంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే.. మీరు పరాన్నజీవులు: రేవంత్ ఫైర్

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రావాళ్ల పైసలతోనే పెట్టాడని, కేసీఆర్‌ రాజకీయంగా మనుగడ సాధించడానికి టీడీపీ సహాయం చేసిందని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల సహకారంతోనే వారు రాజకీయంగా మనగలిగారని, వాళ్లు పరాన్నజీవులంటూ పరుష పదజాలంతో మాట్లాడారు.  

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా పోచారం, గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం వేమూరి రాధాకృష్ణ, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండలవ వెంకటేశ్వరరావుల ప్రదక్షిణం చేసేవాడని ఆరోపించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కోటి రూపాయలు ఇస్తే.. అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడని చెప్పారు. గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

హరీష్ రావు కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలువకముందే ఆయనను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని అన్నారు. టీడీపీ సహకారంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతోనే మీరు బతికారని, మీరు పరాన్న జీవులని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2009లో టీడీపీపై విరుచుకుపడ్డ కేసీఆర్ ఆ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, టీడీపీ దయాదాక్షిణ్యాలతోనే టీఆర్ఎస్ మళ్లీ రాజకీయ మనుగడ సాధించిందని పేర్కొన్నారు. అదే సందర్భంలో సిరిసిల్లలో ఓటమి నుంచి 150 ఓట్ల మెజార్టీతో బయటపడ్డాడని వివరించారు.

అలాగే, ఉచిత కరెంట్ అంశంపైనా మాట్లాడారు. తాను అమెరికాలో మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఉచిత కరెంట్ తెచ్చింది తొలిసారిగా కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నదని, ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. 3,500 సబ్ స్టేషన్‌లలో ఎక్కడ 24 గంటలు ఇచ్చినా.. తాము అక్కడ ఓట్లు అడగబోమని సవాల్ విసిరారు. అదే విధంగా బీఆర్ఎస్ కూడా ఓట్లు అడగవద్దని చాలెంజ్ చేశారు. ప్రతి సబ్ స్టేషన్ వద్ద గ్రామ సభలు, రచ్చబండ, రైతులతో చర్చ పెడదామని అన్నారు.

Also Read: కాంగ్రెస్‌కు కరెంట్ షాక్.. అందుకే విలవిల..హస్తం పార్టీ కుట్రను రైతాంగం తిప్పికొడుతుంది: రాష్ట్రమంత్రులు నిరంజన

ఇక పోచారం, గుత్తాలపైనా మండిపడ్డారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడవచ్చా అని ధ్వజమెత్తారు. వాళ్లకు వయసు, ఒళ్లు పెరిగిందని, కానీ, బుద్ధి పెరగలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోచారం తన కొడుకు అక్రమ దందాలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ చెప్పులు మోస్తున్నారని అన్నారు. స్పీకర్‌గా ఉండి కేసీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గుత్తాను టీడీపీ, కాంగ్రెస్సే ఆదుకుందని అన్నారు. కొడుకుకు టికెట్ కోసం కౌన్సిల్ పదవినే తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. కొడుకులం కోసం ఇంతలా దిగజారుతారా? అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House