‘‘ రాజ్‌పుష్ప ’’ పేరుతో ఆ కలెక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అన్ని బయటపెడతాం: రేవంత్ రెడ్డి ఆరోపణలు

By Siva KodatiFirst Published Jul 17, 2021, 4:19 PM IST
Highlights

కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయనపై గతంలో సీబీఐ విచారణ నివేదిక వుందని దానిని బయటపెడతామన్నారు. వెంకట్రామిరెడ్డి రాజ్‌పుష్ప పేరుతో ఎన్ని వెంచర్లు వేశారు.. ఏం చేశారనేది బయటపెడతామని తెలిపారు.

కోకాపేట్ భూముల వేలంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలం వల్ల ప్రభుత్వానికి రావాల్సింది రూ.3 వేల కోట్లని, కానీ రూ.2 వేల కోట్లే వచ్చాయని ఆయన అన్నారు. 50 అంతస్తుల భవన నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. 2004-05లోనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా కంపెనీలు టెండర్‌లో పాల్గొన్నాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు బడా కంపెనీలు భూముల కొనుగోలుకు ఎందుకు రాలేదని టీపీసీసీ చీఫ్ నిలదీశారు. అనవసరంగా భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.

ALo Read:ఖానామెట్ భూముల వేలం.. 17వ నెంబర్ ఫ్లాట్‌ బిడ్‌పై హైకోర్టు స్టే, కారణం ‘‘సమాధులు‘‘

ప్రభుత్వం తన బినామీలకు భూములను అమ్మకానికి పెట్టిందని రేవంత్ ఆరోపించారు. రాజ్‌పుష్ప ఎన్ని ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారో త్వరలో బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై గతంలో సీబీఐ విచారణ నివేదిక వుందని దానిని బయటపెడతామన్నారు. వెంకట్రామిరెడ్డి రాజ్‌పుష్ప పేరుతో ఎన్ని వెంచర్లు వేశారు.. ఏం చేశారనేది బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు. టెండర్లు రద్దు చేసి.. స్విస్ ఛాలెంజ్ విధానంలో భూములు విక్రయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వెంకట్రామిరెడ్డి ఎవరో కాదని.. కేసీఆర్ కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసిన కలెక్టర్ అని రేవంత్ గుర్తుచేశారు. ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బంధువని తెలిపారు. బడా కంపెనీలు రావొద్దని సిద్దిపేట కలెక్టర్  బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ప్రెస్టేజ్ వాళ్లకు ఏడున్నర ఎకరాల భూమిని ఇచ్చారని ఆయన చెప్పారు. కేటీఆర్‌కు ప్రెస్టేజ్ కంపెనీతో సంబంధాలు వున్నాయని రేవంత్ ఆరోపించారు. వర్సిటీ కంపెనీ శ్రీచైతన్య వాళ్లదని.. ఉద్యమం సమయంలో చైతన్య కాలేజీలను నానా తిట్లు తిట్టారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ దగ్గరి వాళ్లకే భూములు అమ్మకానికి పెట్టారంటూ ఆయన ఆరోపించారు. 
 

click me!