తెలంగాణలో రాహుల్ టూర్‌: కేటీఆర్ సెటైర్లు, కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి

Published : May 06, 2022, 11:55 AM IST
తెలంగాణలో రాహుల్ టూర్‌: కేటీఆర్ సెటైర్లు, కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ టూర్  విషయమై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. కేటీఆర్, కవితల విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు.

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో  ఇవాళ, రేపు Congress పార్టీ అగ్రనేతRahul Gandhi పర్యటన విషయమై  TRS, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాహుల్ గాంధీ టూర్ పై టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలు చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ Revanth Reddy  కౌంటరిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో కాంగ్రెస్ పార్టీ నేతలు Warangal డిక్లరేషన్ ద్వారా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందో కూడా రాహుల్ వివరిస్తారు.

అయితే రాహుల్ గాంధీ టూర్ పై తెలంగాణ మంత్రి KTR  ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అని కేటీఆర్ చెప్పారు.తెలంగాణలోని ఉత్తమ రైతు అనుకూల విధానాలను నేర్చుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయనివ్వాలని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

 

టీఆరఎస్ ఎమ్మెల్సీ Kalvakuntal Kavitha  కూడా రాహుల్ గాంధీ టూర్ పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రహక్కుల కోసం టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారని రాహుల్ ను ప్రశ్నించారు కవిత., వరి కొనుగోలు విషయమై తాము పోరాటం చేసిన సమయంలో మీరు ఎక్కడున్నారని అడిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పోరాటం చేసిన సమయంలో  కాంగ్రెస్ ఎక్కడుందని అడిగారు. తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యా సంస్థను కేటాయించని విషయమై పోరాటంలో మీరు ఏమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ ను కవిత ప్రశ్నించారు.

 

 

కేటీఆర్ వేసిన ప్రశ్నలకు ట్విట్టర్ వేదికగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.  మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలని కేటీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.రుణమాఫీ హామీని ఎలా ఎగ్గొట్టాలి, ఉచిత ఎరువుల హామీని ఎలా అటకెక్కించాలనే విషయాన్ని నేర్చుకోవాలా అని అడిగారు. మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి అనే విషయం నేర్చుకోవాలా అని అడిగారు. వరి,మిర్చి, రైతులు ఎలా చనిపోతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నిజాలను చెప్పేందుకే రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.అదే సమయంలో కల్వకుంట్ల కవితకు కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?