రాహుల్ సభపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం: కారణమదేనా?

Published : May 06, 2022, 11:34 AM IST
రాహుల్ సభపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం: కారణమదేనా?

సారాంశం

కాంగ్రెస్  పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ వరంగల్ సభకు దూరంగా ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.   


హైదరాబాద్: ఎఐసీసీ మాజీ చీఫ్ Rahul Gandhhi సభకు దూరంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy నిర్ణయం తీసుకొన్నారు. కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకత్వం తీరుపై  అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే రాహుల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సభకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు.

Congress పార్టీ నాయకత్వం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తాను BJP లో చేరుతానని కూడా గతంలో ప్రకటించారు. బీజేపీలో చేరే విషయమై ఆ పార్టీ కార్యకర్తతో మాట్లాడిన Audio సంభాషణ కూడా గతంలో వైరల్ గా మారింది. గతంలో కూడా పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.  గత ఏడాది జనవరి 1వ తేదీన Tirupati లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో చేరుతానని కూడా ఆయన చెప్పారు. 

ఈ ఏడాది మార్చి 16న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని ప్రకటించారు.  అయితే KCR  ను గద్దె దింపడమే తన లక్ష్యమని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

Komatireddy Venkat Reddy తో పాటు తాను ఉంటానని  కూడా అనుకోవడం సరైంది కాదని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత మాసంలో ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతుంది.పార్టీకి దూరంగా ఉండాలనే నిర్ణయంలో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ సభకు దూరంగా ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకొన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. ఈ సమావేశానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం ఉన్నందున తాను దూరంగా ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

రాహుల్ గాంధీ వరంగల్ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయా జిల్లాలకు ఇంచార్జీలు జనసమీకరణ చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం రాహుల్ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలోనే పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతుంది. 

ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ హైద్రాబాద్ కు వస్తారు. హైద్రాబాద్ శంషాబాద్ ఎయిిర్ పోర్టు నుండి రాహుల్ గాంధీ వరంగల్ సభకు చేరుకొంటారు. వరంగల్ సభ నుండి రాహుల్ గాంధీ రాత్రికి హైద్రాబాద్ చేరుకొంటారు. హైద్రాబాద్ లో రేపు పలు కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొంటారు. రేపు తెలంగాణ అమరవీరుల సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆ తర్వాత గాంధీ భవన్ లో నిర్వహించే  పీసీసీ కార్యవర్గ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్