మా పోరాటాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే: సోనియా ఈడీ విచారణపై రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 21, 2022, 10:13 PM IST

సోనియా గాంధీని ఈడీ  విచారించడం అవమానించడమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ గురువారం నాడు హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగింది.


హైదరాబాద్: Gas, GST పెట్రోల్ ధరల మీద తాము  పోరాటం చేస్తుంటే ఈ విషయాన్ని పక్క దారి పట్టించేందుకు సోనియా గాంధీని  Enforcement Directorate  అధికారులు విచారించారని టీపీసీసీ చీఫ్ Revanth Reddy  ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఈడీ అధికారులు గురువారం నాడు న్యూఢిల్లీలో విచారించారు.ఈ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైద్రాబాద్ ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  దేశం కోసం సోనియాగాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ తన ప్రాణాలను అర్పించిందన్నారు..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఎలా హత్యకు గురయ్యారో రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

పాకిస్థాన్ మీద రెండుసార్లు యుద్ధం చేసి ప్రపంచ దేశాలకు భారత్ ప్రతాపం ఇందిరాగాంధీ చూపించారని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రపంచ దేశాలకు భారత అభివృద్ధి చూపించారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును కల్పించారన్నారు. 

Latest Videos

undefined

రాజీవ్ హత్యానంతరం దేశం కోసం తాము సైతం ప్రాణాలకు సిద్ధమని సోనియా, రాహుల్ గాంధీ లు బాద్యతలు స్వీకరించారని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశం శ్రీలంక లాంటి ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు ను ప్రధాని చేసి దేశంలో ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చినట్టుగా చెప్పారు.  

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ యువకలు, విద్యార్ధులు ఆత్మ బలిదానం చేసుకుంటున్న విషయాన్ని అప్పట్లో తెలంగాణ నుండి ప్రాతినిథ్యం  వహించిన  కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీకి దృష్టికి తీసుకు వచ్చారన్నారు.  తెలంగాణ తల్లుల కడుపుకోతను చూసిన సోనియా గాంధీ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.  అనేక త్యాగాలు, బలిదానాల మీద దేశాన్ని నిలబెట్టిన గాంధీ కుటుంబంపై  ఆరోపణలు చేయడం  సరైంది కాదన్నారు.  సోనియాను అవమానిస్తే మనం ఊరుకొంటామా అని రేంత్ రెడ్డి అడిగారు.  ఈ విషయమై నోరు మెదపకపోతే మనది మానవ జన్మ అవుతుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న డాక్టర్లతో పాటు ఇతరులను దేశానికి సేవ చేయాలని ఇండియాకు రావాలని ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చారన్నారు. 

మాజీ మంత్రి గీతారెడ్డి లాంటి నేతలు ఈ రకంగానే విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చి రాజకీయాల్లో రాణించారని ఆయన ప్రస్తావించారు. తనకు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చారన్నారు. మనతల్లిని ఎవరైనా అవమానించేందుకు ప్రయత్నిస్తే వాడి తల తెగ నరికే వరకు వెనుకాడమన్నారు.

తెలంగాణ ప్రజల ఆరాధ్యురాలైన సోనియాగాంధీకి ఈడీ  విచారణ చేయడం కక్ష సాధింపు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రం మొత్తం సోనియాగాంధీ కి అండగా నిలబడుతామన్నారు. 4 కోట్ల ప్రజలు స్వతంత్రం గా బతకాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించారన్నారు. ఆత్మబలిదానాలు చూసి ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని రేవంత్ రెడ్డి చెప్పారు

.రాష్ట్రం ఇచ్చిన తల్లికి జెండాలు ,ఎజెండాలు , మతాలు పక్కన బెట్టి అండగా నిలబడదామని రేవంత్ రెడ్డి కోరారు. .ఇది రాజకీయ పోరాటం కాదు....ఆత్మగౌరవ పోరాటంగా ఆయన అభివర్ణించారు.సోనియాగాంధీ మీద దాడి అంటే భారత మాత మీద దాడి, తెలంగాణ తల్లి మీద దాడిగా ఆయన పేర్కొన్నారు. .ఈ దాడిని అందరూ  ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి కోరారు.

2004 - 14 వరకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ  కేంద్రంలో అధికారంలో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.విద్యా హక్కు,సమాచార హక్కు, ఆహారభద్రత చట్టం,ఉపాధిహామీ చట్టాన్ని తీసుకు వచ్చారని కాంగ్రెస్ నేత గుర్తు చేశారు.

దోచుకున్న దొంగలను  శిక్షించడానికి సమాచార హక్కు చట్టం తెచ్చారన్నారు. దోచుకునే రకమైతే సమాచార హక్కు చట్టాన్ని సోనియాగాంధీ ఎందుకు తీసుకు వస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీపం పథకం తెచ్చి అడబిడ్డలను కట్టెలపోయి నుండి విముక్తి కల్పించారన్నారు. రాంలీలా మైదానం లో మీరో మెమో తేల్చుకుందామని ప్రధాని నరేంద్రమోడీకి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

click me!