తెలంగాణలో కారు దారు తప్పింది.. గులాబీ చీడ వదిలిస్తాం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 18, 2021, 7:18 PM IST
Highlights

తెలంగాణను రక్షించుకోవడానికి దేవేందర్ గౌడ్ సేవలు అవసరమని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని ప్రశంసించారు
 

తెలంగాణలో కారు దారు తప్పిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌తో ఆదివారం భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవేందర్ గౌడ్ పాదయాత్రతోనే ఆనాడు కాంగ్రెస్ జలయజ్ఞం ప్రారంభించిందన్నారు. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరనీ కలుస్తారనీ కలుస్తామని రేవంత్ చెప్పారు.

Also Read:నేడు దేవేందర్‌గౌడ్ ఇంటికి రేవంత్ రెడ్డి: వీరేందర్‌కు కాంగ్రెస్ గాలం

తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తామని టీపీసీసీ చీఫ్ అన్నారు. తెలంగాణను రక్షించుకోవడానికి దేవేందర్ గౌడ్ సేవలు అవసరమని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకే ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని ప్రశంసించారు. తెలంగాణవాదులు కలిసి రావాలని కోరుతున్నామని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్, మధుయాష్కీలు తనకు దగ్గరి వ్యక్తులన్నారు. బీజేపీలో అసంతృప్తికి.. ఈ భేటీకి సంబంధం లేదన్నారు వీరేందర్ గౌడ్. 
 

click me!