ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి.. దండోరా మోగించబోతున్నాం: రేవంత్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 08, 2021, 02:56 PM IST
ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి.. దండోరా మోగించబోతున్నాం: రేవంత్ రెడ్డి

సారాంశం

కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో.. దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఇంద్రవెల్లిలో బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.  

తెలంగాణ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇంద్రవెల్లిలో సోమవారం తలపెట్టిన భారీ బహిరంగసభను విజయవంతం చేసేందుకు నేతలు కృషి చేస్తున్నారు. కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో.. దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 9న సాయంత్రం 3 గంటలకు ఇంద్రవెల్లిలో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు. 
ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించబోతున్నామని.. తెలంగాణ సమాజమంతా కదిలి కేసీఆర్‌పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ పిలుపునిచ్చారు.

Also Read:హుజూరాబాద్ బైపోల్: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్, దళితబంధుకు చెక్
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?