తెలివిగా తప్పించుకుంటున్నారు: పేపర్ లీక్ లో కేటీఆర్ పై రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Mar 21, 2023, 4:20 PM IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కేసులో  హైకోర్టులో  కీలక వాదనలను విన్పించినట్టుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఈ కేసుపై సిట్  విచారణపై  రేవంత్ రెడ్డి పెదవి విరిచారు.  


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  ఐటీ మంత్రి  కేటీఆర్ తెలివిగా  తప్పించుకుంటున్నాడని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మంగళవారంనాడు  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  హైద్రాబాద్ లో మీడియాతో చిట్ చాట్  చేశారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్  పరిధిలోనే  ఐటీ శాఖ పనిచేస్తుందన్నారు. కానీ టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసు విషయంలో ఐటీ  తన పరిధి కాదని  కేటీఆర్ తెలివిగా తప్పించుకుంటున్నారని  రేవంత్ రెడ్డి  విమ,ర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసు అంశం  ప్రవీణ్, రాజశేఖర్ లకే పరిమితం కాదన్నారు. ఈ  కేసులో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సెక్రెటరీలు, శంకర్ లక్ష్మిలను కూడా  భాద్యులు గా చేర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్  చేశారు.   

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  సిట్  విచారణతో  పూర్తిగా  బయటపడదన్నారు.  సిట్ అంటే సిట్, స్టాండ్  మాత్రమేనని  రేవంత్ రెడ్డి  ఎద్దేవా  చేశారు. గతంలో సిట్ విచారణ చేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  డ్రగ్స్, నయీమ్ ,   గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే ల  కొనుగోలు  అంశం ఏమైందని  రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. 

Latest Videos

undefined

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్ కేసులో  హైకోర్టులో  కీలకమైన వాదనలు విన్పించినట్టుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలను  వివరాలను  పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోర్టును కోరినట్టుగా   రేవంత్ రెడ్డి  చెప్పారు.  పేపర్ లీక్  కేసులో   గంట పాటు  కోర్టులో  వాదనలు జరిగినట్టుగా  ఆయన  చెప్పారు. 
ఇరువర్గాల  న్యాయవాదులు  తమ  వాదనలు  విన్పించారని  రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సిట్ విచారించిన విషయాలు తమకు  కూడా తెలపాలని కోరామన్నారు. సిట్ రిపోర్ట్ కోర్టుకు  ఇవ్వడంతో  పాటు  తమకు  కూడా  ఇవ్వాలని కోరామన్నారు.  

టీఎస్‌పీఎస్ సీ లో వున్న సిస్టమ్ లకు  ఐటీ శాఖే బాధ్యత వహించాలని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్  ఓనర్ అని సెక్రెటరీ కాపలాదారుగా  వ్యవహరించాలని రేవంత్ రెడ్డి  చెప్పారు. శంకర్ లక్ష్మి..  ప్రవీణ్, రాజశేఖర్లు  పనిచేసే సిబ్బంది  అని  రేవంత్ రెడ్డి  వివరించారు.  

తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని ఆయన  ప్రశ్నించారు.  టీఎస్ పీఎస్ సీ   తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.   సిట్ విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్  ఆంధ్రప్రాంతానికి  చెందినవాడేనని  ఆయన  చెప్పారు.  సిట్ అధికారి ఆంధ్ర అధికారి ఐనప్పుడు రిపోర్ట్ ఎలా ఉంటదో  ఆలోచించుకోవాలని  రేవంత్ రెడ్డి  కోరారు.  

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : నిందితుల ఇళ్లలో సిట్ సోదాలు

తెలంగాణ ఉద్యమం డీఎన్ఏ విద్యార్ధి ఉద్యమమని  ఆయన  పేర్కొన్నారు. 30 లక్షల నిరుద్యోగుల  గోస  కేసీఆర్ సర్కార్ కు పట్టదా అని  ఆయన ప్రశ్నించారు. విచారణ సరిగ్గా జరగాలని తాను కోరితే తనకు  నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి  చెప్పారు.  తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడ పోయారని ఆయన ప్రశ్నించారు.  

 

click me!