పొన్నం చైర్మెన్ గా బీసీ డిక్లరేషన్‌పై కమిటీ: పీసీసీ

By narsimha lode  |  First Published Aug 30, 2023, 5:07 PM IST

బీసీ డిక్లరేషన్ పై  పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో  కమిటీ  ఏర్పాటు వేసింది. త్వరలోనే  బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.



హైదరాబాద్: బీసీ డిక్లరేషన్ పై  పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ వేసింది  పీసీసీ.బీసీ డిక్లరేషన్ పై  పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ పని చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్  17 లోపుగా  అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  ఇందులో భాగంగానే  ఇవాళ  పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో  కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్.  ఈ కమిటీలో  ఆరుగురిని కో చైర్మెన్లుగా  ప్రకటించింది  కాంగ్రెస్. ఈ కమిటీకి  మరో 9 మంది అడ్వైజరీలను నియమించింది.

ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నెల  29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన వాయిదా పడింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై  కూడ  కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.

Latest Videos

ఇదిలా ఉంటే  మాజీ పీసీసీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్యతో  బీసీ సంక్షేమ సంఘం నేత, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ  ఆర్. కృష్ణయ్య ఇవాళ భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు,  బీసీలకు సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు  పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని  ఆర్.కృష్ణయ్య  ఆ పార్టీని కోరారు. బీసీ డిక్లరేషన్ లో  పొందుపర్చాల్సిన అంశాలపై  కృష్ణయ్య  కాంగ్రెస్ నేత పొన్నాలకు పలు సూచనలు చేశారు.  మరో వైపు  బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య చేసిన సూచనలను  పరిగణనలోకి తీసుకుంటామని  పొన్నాల లక్ష్మయ్య  తెలిపారు.

also read:అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు:ఆ 22 స్థానాల్లో ఆశావాహులకు లైన్ క్లియర్

వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా  ఉంది. ఈ మేరకు  అభ్యర్థులను కూడ  ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని భావిస్తుంది.ఈ మేరకు నిన్ననే  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో  అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి  స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది.  మరో నాలుగైదు రోజుల్లో మరోసారి  కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. 

 

click me!