తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 379 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 07, 2021, 11:40 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 379 పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేవలం 5.053మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(మంగళవారం రాత్రి 8 గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 41,246మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 379మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,88,789కు చేరితే టెస్టుల సంఖ్య 71,45,613కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 305 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,82,177కి చేరింది.  దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,053 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,776గా వుంది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1559కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.71శాతంగా వుంది. 


 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం