తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన కేసులు, పెరిగిన రికవరీలు

Arun Kumar P   | Asianet News
Published : Nov 23, 2020, 09:00 AM ISTUpdated : Nov 23, 2020, 09:14 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన కేసులు, పెరిగిన రికవరీలు

సారాంశం

కరోనా మహమ్మారి నుండి తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా బయటపడుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. గతకొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా, రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో అతి తక్కువగా యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇలా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే అంశమే. 

తాజాగా గత 24 గంటల్లో (శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 24,139మందికి టెస్టులు చేయగా కేవలం 602మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 51,58,474కు చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,64,128కు చేరాయి. 

 ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1015 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,51,468కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,227కు తగ్గాయి.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1433కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.20 శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 129కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 60, రంగారెడ్డి 62, భద్రాద్రి కొత్తగూడెం 25, కరీంనగర్ 51, ఖమ్మం16,   సంగారెడ్డి 24, సిద్దిపేట 16, సూర్యాపేట 18, వరంగల్ అర్బన్ 27, నల్గొండ 21, మంచిర్యాల 18, జగిత్యాల 34 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్