తెలంగాణ కరోనా అప్ డేట్: మళ్లీ కలకలం... 2,804 చేరిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2021, 10:21 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: మళ్లీ కలకలం... 2,804 చేరిన యాక్టివ్ కేసులు

సారాంశం

దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ కలవరాన్ని రేపుతున్నాయి.  

 హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 64,898మందికి కరోనా టెస్టులు చేయగా 394మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,118కు చేరితే టెస్టుల సంఖ్య 96,13,583కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 194మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,98,645కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 2,804 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 1,123గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1669కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.9శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.52శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 5, నాగర్ కర్నూల్ 12, జోగులాంబ గద్వాల 4,  కామారెడ్డి 7, ఆదిలాబాద్ 11, భూపాలపల్లి 2, జనగామ 3, జగిత్యాల 10, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 3, మెదక్ 4, నిర్మల్ 10, నిజామాబాద్ 10,  సిరిసిల్ల 7, వికారాబాద్ 7, వరంగల్ రూరల్ 6,  ములుగు 1, పెద్దపల్లి 5, సిద్దిపేట 5, సూర్యాపేట 7, భువనగిరి 7, మంచిర్యాల 9, నల్గొండ 12 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 81కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 34, రంగారెడ్డి 64, కొత్తగూడెం 5, కరీంనగర్ 11, ఖమ్మం 17,  సంగారెడ్డి 11, వరంగల్ అర్బన్ 10కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 


 

PREV
click me!

Recommended Stories

Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
Viral News: కింగ్‌ఫిష‌ర్ బీర్ బాటిల్‌లో చేప పిల్ల‌.. వార్త‌ల‌పై స్పందించిన కంపెనీ. ఏమన్నారంటే.?