తెలంగాణ కరోనా అప్ డేట్... రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులెన్నంటే...

Arun Kumar P   | Asianet News
Published : Feb 21, 2021, 11:06 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్... రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులెన్నంటే...

సారాంశం

తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 23,607మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 163మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 23,607మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 163మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,97,598కు చేరితే టెస్టుల సంఖ్య 84,56,940కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 146మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,94,243కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1731 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 678గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1624కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 97.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.87శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 3,నాగర్ కర్నూల్ 0, జోగులాంబ గద్వాల 1,  కామారెడ్డి 0, ఆదిలాబాద్ 4, భూపాలపల్లి 2, జనగామ 1, జగిత్యాల 6, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 5, మహబూబాబాద్ 1, మెదక్ 2, నిర్మల్ 1, నిజామాబాద్ 3,  సిరిసిల్ల 3, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 4,  ములుగు 2, పెద్దపల్లి 5, సిద్దిపేట 8, సూర్యాపేట 5, భువనగిరి 3, మంచిర్యాల 7, నల్గొండ 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 29కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 11, రంగారెడ్డి 12, కొత్తగూడెం 6, కరీంనగర్ 10, ఖమ్మం 3,  సంగారెడ్డి 6, వరంగల్ అర్బన్ 8కేసులు నమోదయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే
మా దగ్గర కూడా కండలు తిరిగినోళ్లు ఉన్నారు: Revanth Reddy warns Kaushik Reddy & BRS | Asianet Telugu