తెలంగాణ కరోనా అప్ డేట్: మెల్లిగా సేఫ్ జోన్లోకి... భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 20, 2020, 09:01 AM ISTUpdated : Nov 20, 2020, 09:21 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: మెల్లిగా సేఫ్ జోన్లోకి... భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. 

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవడం, రికవరీల సంఖ్య అధికంగా వుండటంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గింది. తాజాగా వైద్యారోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం12,515 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నాయి. జిహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇలా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశమే. యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా వుందంటే వైరస్ వ్యాప్తి అవకాశాలు కూడా తక్కువగా వున్నట్లే.  

ఇక తాజాగా గత 24 గంటల్లో(బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా  39,448 మందికి టెస్టులు చేయగా కేవలం 894 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 50,58,612కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 2,61,728కు చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1057 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,47,790కి చేరింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1423కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.67శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 154కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 84, రంగారెడ్డి 70, భద్రాద్రి కొత్తగూడెం 54, కరీంనగర్ 36, ఖమ్మం 39, నిజామాబాద్ 14, సంగారెడ్డి 32, సిద్దిపేట 21, సూర్యాపేట 22, వరంగల్ అర్బన్ 41, పెద్దపల్లి 28, నల్గొండ 48, మంచిర్యాల 24, జగిత్యాల 32, యాదాద్రి భువనగిరి 25 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?