తెలంగాణ కరోనా అప్ డేట్: 3 లక్షలకు చేరువలో పాజిటివ్, 4,105 యాక్టివ్ కేసులు

By Arun Kumar PFirst Published Jan 19, 2021, 10:12 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం మెల్లిగా కరోనా కోరల్లోంచి భయటపడుతోంది. ఇటీవల అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 31,486మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 256మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కు చేరితే టెస్టుల సంఖ్య 75,15,066కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 208 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,86,542కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4,105 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,283గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1581కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.08శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి,నాగర్ కర్నూల్ జిల్లాల్లో కేసులేవి బయటపడలేదు. ఇక జోగులాంబ గద్వాల 1,  కామారెడ్డి 1, ఆదిలాబాద్ 6, భూపాలపల్లి 8, జనగామ 6, జగిత్యాల 9, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 4, మహబూబాబాద్ 1, మెదక్ 3, నిర్మల్ 3, నిజామాబాద్ 3,  సిరిసిల్ల 7, వికారాబాద్ 9, వరంగల్ రూరల్ 5,  ములుగు 5, పెద్దపల్లి 10, సిద్దిపేట 6, సూర్యాపేట 9, భువనగిరి 3, మంచిర్యాల 10, నల్గొండ 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 51కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 17, రంగారెడ్డి 15, కొత్తగూడెం 9, కరీంనగర్ 11, ఖమ్మం 9,  సంగారెడ్డి 8, వరంగల్ అర్బన్  10కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.19.01.2021) pic.twitter.com/NGjSwymBJT

— IPRDepartment (@IPRTelangana)


 
 

click me!