మద్యం తాగని ఊరు.. గొడవలు లేని గ్రామం..! మనదగ్గరే..

By AN TeluguFirst Published Jan 19, 2021, 9:34 AM IST
Highlights

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఊరు అందరికీ ఆదర్వంగా నిలుస్తుంది. పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. అంతేకాదు ఆ ఊళ్లో ఎవ్వరూ మద్యం ముట్టరు. తగాదాలొస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగరు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మోట్లతిమ్మాపురం గ్రామంలో నేటికీ కనిపిస్తున్న ఆదర్శాలివి. 

మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఊరు అందరికీ ఆదర్వంగా నిలుస్తుంది. పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. అంతేకాదు ఆ ఊళ్లో ఎవ్వరూ మద్యం ముట్టరు. తగాదాలొస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగరు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మోట్లతిమ్మాపురం గ్రామంలో నేటికీ కనిపిస్తున్న ఆదర్శాలివి. 

చిన్నా చితకా తగాదాలొస్తే చక్కగా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే గ్రామం పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదట. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పుకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. 

ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవలే కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల్లోనూ  గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. ప

దేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల లాగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిల్లల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. 

అంతేకాదు తప్పు జరిగితే ప్రశ్నించే చైతన్యం ఈ గ్రామస్తుల సొంతం. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు.

అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 

click me!