తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 948 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 18, 2020, 09:28 AM ISTUpdated : Nov 18, 2020, 09:47 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 948 పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా మహమ్మారి  వ్యాప్తి కొనసాగుతోంది.గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా వ్యాప్తి  మాత్రం కొనసాగుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మమమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గత 24గంటల్లో(సోమవారం రాత్రి 8 గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 42,433 మందికి టెస్టులు చేయగా 948 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 49,772,407 కి చేరగా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1607 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,45,293కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,068కి చేరింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1415కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.42శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 154కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 83, రంగారెడ్డి 76, భద్రాద్రి కొత్తగూడెం 61, కరీంనగర్ 55, ఖమ్మం 44, నాగర్ కర్నూల్ 16, నిజామాబాద్ 13, సంగారెడ్డి 38, సిద్దిపేట 22, సూర్యాపేట 24, వరంగల్ అర్బన్ 40, పెద్దపల్లి 22, నల్గొండ 45, మంచిర్యాల 26, జగిత్యాల 27కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...