తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో మిగిలింది 7,172 పాజిటివ్ కేసులే

Arun Kumar P   | Asianet News
Published : Dec 17, 2020, 09:45 AM ISTUpdated : Dec 17, 2020, 09:54 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో మిగిలింది 7,172 పాజిటివ్ కేసులే

సారాంశం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది.  తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం 7,172 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు మరింత తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 48,652 మందికి టెస్టులు చేయగా కేవలం 509మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,79,644కి చేరగా మొత్తం టెస్టుల సంఖ్య 63,06,397కు చేరింది. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 517 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,70,967కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,172 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1505కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.89శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే  జోగులాంబ గద్వాల 2, ఆదిలాబాద్ 6, కామారెడ్డి 4, నారాయణ పేట 2, భూపాలపల్లి 6, జనగామ 5, జగిత్యాల 13, వనపర్తి 7, అసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 11, మెదక్ 6, నాగర్ కర్నూల్ 11,  నిర్మల్ 5, నిజామాబాద్ 11,  సిరిసిల్ల 5, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 11,  ములుగు 10, పెద్దపల్లి 13, సిద్దిపేట 19, సూర్యాపేట 15, భువనగిరి 9, మంచిర్యాల 12, నల్గొండ 13, సంగారెడ్డి 18 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 104కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 45, రంగారెడ్డి 42, కొత్తగూడెం 14, కరీంనగర్ 15, ఖమ్మం 25,  సంగారెడ్డి 18,  వరంగల్ అర్బన్ 27కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 


 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu