కరోనా కోరల్లోంచి బయటపడుతున్న తెలంగాణ... తాజాగా కేవలం 99కేసులే

Published : Feb 15, 2021, 11:16 AM IST
కరోనా కోరల్లోంచి బయటపడుతున్న తెలంగాణ... తాజాగా కేవలం 99కేసులే

సారాంశం

తెలంగాణలో ప్రస్తుతం కేవలం 1676 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 15,766మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 99మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,96,673కు చేరితే టెస్టుల సంఖ్య 83,11,404కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 169మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,93,379కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1676 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 705గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1618కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 97.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.88శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 0,నాగర్ కర్నూల్ 0, జోగులాంబ గద్వాల 0,  కామారెడ్డి 0, ఆదిలాబాద్ 4, భూపాలపల్లి 1, జనగామ 1, జగిత్యాల 4, అసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 2, మహబూబాబాద్ 0, మెదక్ 1, నిర్మల్ 1, నిజామాబాద్ 4,  సిరిసిల్ల 0, వికారాబాద్ 2, వరంగల్ రూరల్ 4,  ములుగు 0, పెద్దపల్లి 0, సిద్దిపేట 4, సూర్యాపేట 3, భువనగిరి 0, మంచిర్యాల 5, నల్గొండ 0 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 24కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 8, రంగారెడ్డి 10, కొత్తగూడెం 0, కరీంనగర్ 9, ఖమ్మం 2,  సంగారెడ్డి 5, వరంగల్ అర్బన్ 5కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud