తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 276పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 14, 2021, 12:30 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 276పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకు బాగా తగ్గుతూ వస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(మంగళవారం రాత్రి 8 గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 28,894మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 276 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,916కు చేరితే టెస్టుల సంఖ్య 73,79,538కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 238 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,84,849కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4,495 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,487గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1572కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.91శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే కామారెడ్డిలో కేసులేవి భయటపడలేవు. నారాయణపేట 1, జోగులాంబ గద్వాల 1,  , ఆదిలాబాద్ 6, భూపాలపల్లి 3, జనగామ 6, జగిత్యాల 8, అసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 7, మెదక్ 5, నాగర్ కర్నూల్ 7,  నిర్మల్ 5, నిజామాబాద్ 8,  సిరిసిల్ల 7, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 7,  ములుగు 2, పెద్దపల్లి 8, సిద్దిపేట 6, సూర్యాపేట 1, భువనగిరి 4, మంచిర్యాల 9, నల్గొండ 8, వనపర్తి 4 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా  53కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 18, రంగారెడ్డి 23, కొత్తగూడెం 8, కరీంనగర్ 16, ఖమ్మం 8,  సంగారెడ్డి 10, వరంగల్ అర్బన్ 15 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu
CSK vs SRH : హైదరాబాద్ లో భారీ వర్షం... ఐపిఎల్ మ్యాచ్ అనుమానమేనా..?