తెలంగాణ కరోనా అప్ డేట్: టెస్టుల సంఖ్య పెరిగినా... భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 13, 2020, 09:02 AM ISTUpdated : Nov 13, 2020, 09:51 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: టెస్టుల సంఖ్య పెరిగినా... భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో తాజాగా చాలా తక్కువ కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 42,163మందికి టెస్టులు చేయగా కేవలం 99మందికి  మాత్రమే పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం టెస్టుల సంఖ్య 48,12,16కు చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,55,663కు చేరింది.  

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1222 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,37,172కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,094కి చేరింది. 

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1397కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.9శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 92.76శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 169కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 85, రంగారెడ్డి 66, భద్రాద్రి కొత్తగూడెం 65, కరీంనగర్ 49, ఖమ్మం 44, నల్గొండ 46, వరంగల్ అర్బన్ 44 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

పూర్తి వివరాలు:
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం