హైదరాబాద్: అర్థరాత్రి కారు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి

Published : Nov 13, 2020, 06:44 AM IST
హైదరాబాద్: అర్థరాత్రి కారు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడెం వద్ద సాగర్ రోడ్డుపై అర్థరాత్రి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు మృత్యువాత పడ్డారు. 

హైదరాబాదు నుంచి ఇబ్రహీంపట్నం వైపు వేగంగా వెళ్తున్న టాటా సఫారీ కారు యమహా ఫాసినోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యమహా ఫాసినోపై ఉన్న తల్లీకొడుకు అక్కడికక్కడే మరణించారు. 

మృతులు రాగన్నగూడెం జీవీఆర్ కాలనీలో నివాసం ఉండే సంరెడ్డి ప్రదీప్ రెడ్డి (19), సంరెడ్డి చంద్రకళ (48)లుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

తల్లీకొడుకుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం