టీడీపీ స్థానంలో టీజేఎస్ పోటీ: ఏడుగురితో టీజేఎస్ జాబితా

By narsimha lodeFirst Published 18, Nov 2018, 5:53 PM IST
Highlights

టీజేఎస్ ఏడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం నాడు ప్రకటించింది

హైదరాబాద్:  టీజేఎస్ ఏడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం నాడు ప్రకటించింది.టీడీపీ ప్రకటించిన మహాబూబ్ నగర్ స్థానంలో కూడ టీజేఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. గతంలో మహాబూబ్ నగర్ స్థానం నుండి టీడీపీ తన అభ్యర్థిగా ఎర్ర శేఖర్ ను ప్రకటించింది. 

మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుకొంటుంది. మాజీ మంత్రి జానారెడ్డగి తనయుడు రఘువీర్ రెడ్డగి ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఈ స్థానంలో టీజేఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ అభ్యర్థులకు టీజేఎస్ భీ పామ్ లు కూడ ఇచ్చింది.


టీజేఎస్ అభ్యర్థుల జాబితా

మెదక్ -జనార్ధన్ రెడ్డి
సిద్దిపేట-భవానీరెడ్డి
దుబ్బాక- రాజ్‌కుమార్
మల్కాజిగిరి -దిలీప్ కుమార్
వరంగల్ తూర్పు- ఇన్నయ్య
మిర్యాలగూడ - విద్యాధర్ రెడ్డి
మహాబూబ్ నగర్ -రాజేందర్ రెడ్డి
 

Last Updated 18, Nov 2018, 5:53 PM IST