
న్యూఢిల్లీ: తెలంగాణ జనసమితి చీఫ్ Kodandaram న్యూఢిల్లీకి వెళ్లారు. కొంత కాలంగా TJS ను ఆప్ లో విలీనం చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారం సాగుతున్న తరుణంలో కోదండరామ్ Delhi టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో కూడా టీజేఎస్ ను Congressస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం సాగింది. కానీ టీజేఎస్ ను కోదండరామ్ నడుపుతున్నారు. అయితే AAP లో టీజేఎస్ ను విలీనం చేస్తారనే ప్రచారం ప్రస్తుతం సాగుతుంది.ఆప్ లో విలీనం కూడా గతంలో కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం లాంటిదేననే కోదండరామ్ కొట్టిపారేశారు. punjab రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొన్న ఆప్ దేశంలోని ఇతర రాష్ట్రాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్ ఇటీవలనే ఆయన సీపీఐకి రాజీనామా చేశారు. ఆప్ లో సుధాకర్ చేరనున్నారు.
2023లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో పాగా వేయాలని ఆప్ భావిస్తుంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మంచి ఓట్లను సాధించింది. అయితే తెలంగాణలో కూడా మంచి ఓట్లను, సీట్లను సాధించడం కోసం ఆప్ ప్రయత్నాలను చేస్తుంది.ఈ విషయమై తెలంగాణలో పట్టున్న నేతల కోసం ఆప్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆప్ లో టీజేఎస్ ను విలీనం చేయాలనే ప్రతిపాదన తెచ్చారనే ప్రచారం కూడా సాగుతుంది.
2018 ఎన్నికల సమయంలో మహాకూటమిలో టీజేఎస్ భాగస్వామిగా ఉంది. అయితే ఈ కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. మరో వైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే ఈ తరుణంలో పార్టీని బలోపేతం చేసే విషయమై కోదండరామ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలోనే ఆప్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది మార్చి మాసంలో నగర శివారులో టీజేఎస్ కు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీజేఎస్ విలీనం ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారని సమాచారం. అయితే టీజేఎస్ ను ఆప్ లో విలీనం చేసేందుకు కోదండరామ్ సానుకూలంగా లేరనే తెలుస్తుంది.
అయితే ప్రొఫెసర్ కోదండరామ్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఢిల్లీ టూర్ లో ఆప్ నేతలను కోదండరామ్ కలుస్తారా అనే చర్చ కూడా లేకపోలేదు. ఆప్ తో టీజేఎస్ పొత్తు పెట్టుకుంటుందా, లేదా ఆప్ లో టీజేఎస్ విలీనం అవుతుందా అనే విషయమై రకరకాల ఊహగానాలు విన్సిస్తున్నాయి. అయితే ఈ విషయమై కోదండరామ్ నోరు విప్పాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేయాలని కోదండరామ్ భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన మహా కూటమి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే ఈ దఫా ఎన్నికలకు చాలా రోజుల ముందు నుండే ఈ పని చేయాలని కూడా టీజేఎస్ భావిస్తుందని ప్రొఫెసర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆప్ తో చర్చలు జరిపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో పాగా వేయడం కోసం ఆప్ కూడా కోదండరామ్ వంటి వారి సహాయం తీసుకోవడాన్ని కొట్టిపారేయలేమని కూడా చర్చ కూడా సాగుతుంది.