తెలంగాణకు తిత్లీ ఎఫెక్ట్:3రోజులు విద్యుత్ సమస్యలు

By Nagaraju TFirst Published Oct 13, 2018, 8:50 PM IST
Highlights

తిత్లీ తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి తాకింది. ఉత్తరాంధ్రలో తుఫాన్ రావడం ఏంటి తెలంగాణకు ప్రభావం ఏంటనకుంటున్నారా ఉంది. తిత్లీ తుఫాన్ ధాటికి దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందులో భాగంగా తెలంగాణకు 3000 మెగా వాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

హైదరాబాద్: తిత్లీ తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రానికి తాకింది. ఉత్తరాంధ్రలో తుఫాన్ రావడం ఏంటి తెలంగాణకు ప్రభావం ఏంటనకుంటున్నారా ఉంది. తిత్లీ తుఫాన్ ధాటికి దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందులో భాగంగా తెలంగాణకు 3000 మెగా వాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తెలంగాణలో 2 నుంచి 3రోజులపాటు విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

3వేల మెగా వాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ధర్మల్, హైడల్ పవర్ స్టేషన్లలో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి జరగాలని సూచించారు. మరోవైపు బహిరంగ మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు.   

click me!