మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంతో ఈ సంస్థ మోసాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న క్యూ నెట్ సంస్థకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. మంగళవారంనాడు తన కార్యాలయంలో హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీన స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంతో క్యూనెట్ సంస్థ కారణంగా మోసపోయిన విషయం బయటకు వచ్చిందని సీపీ చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
క్యూనెట్ సంస్థ హాంకాంగ్ లో రిజిస్టరై ఉందన్నారు. అయితే ఇండియాలో విహాన్ అనే కంపెనీ ద్వారా మన దేశంలో మార్కెటింగ్ జరుగుతుందని సీపీ సీవీ ఆనంద్ వివరించారు. మార్కెటింగ్ స్కీంలో విహాన్ అలియాస్ రాజేష్ ఖన్నా అనే వ్యక్తి సూత్రధారిగా గుర్తిచామని సీపీ చెప్పారు. రాజేష్ ఖన్నాను అతి కష్టం మీద అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
also read:స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి: ముగ్గురు క్యూనెట్ ప్రతినిధుల అరెస్ట్
క్యూనెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మోసానికి పాల్పడినట్టుగా సీపీ చెప్పారు. 150 మంది రూ. 3 కోట్లు వసూలు చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీపీ ఆనంద్ తెలిపారు. క్యూనెట్ సంస్థకు చెందిన సంస్థకు చెందిన రూ. 54 కోట్లు ఈడీ సీజ్ చేసిన విషయాన్ని సీపీ సీవీ ఆనంద్ గుర్తు చేశారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ పై నిఘా పెట్టామన్నారు