మహిళ తో అసభ్య ప్రవర్తన... ఫాస్ట్ పుడ్ సెంటర్ లో చిత్రహింసలు

Published : Mar 01, 2021, 08:21 AM IST
మహిళ తో అసభ్య ప్రవర్తన... ఫాస్ట్ పుడ్ సెంటర్ లో చిత్రహింసలు

సారాంశం

కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో  చిత్ర హింసలకు గురిచేశారు. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్ కు చెందిన లింగస్వామి అనే వ్యక్తి ఓ మహిళో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు. చర్లపల్లి ఈసీ నగర్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లింగస్వామి నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి  బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud