యూట్యూబర్ షణ్ముఖ్ కి మరో షాకిచ్చిన పోలీసులు

Published : Mar 01, 2021, 07:51 AM ISTUpdated : Mar 01, 2021, 08:03 AM IST
యూట్యూబర్ షణ్ముఖ్ కి మరో షాకిచ్చిన పోలీసులు

సారాంశం

మద్యం మత్తులో ఉండటంతో శనివారం రాత్రి వరకు అతనిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. తనకు సినీ ఇండస్ట్రీలో చాలా బలం ఉందంటూ.. గంటలో వారందరూ వస్తారంటూ షణ్ముఖ్ పోలీసులకు సవాలు విసరడం గమనార్హం.

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ కి పోలీసులు మరో షాకిచ్చారు. షణ్ముఖ్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మద్యం తాగి జూబ్లిహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో పలు వాహనాలను ఢీ కొట్టి సంఘటనలో షణ్ముఖ్ ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా... మద్యం మత్తులో ఉండటంతో శనివారం రాత్రి వరకు అతనిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. తనకు సినీ ఇండస్ట్రీలో చాలా బలం ఉందంటూ.. గంటలో వారందరూ వస్తారంటూ షణ్ముఖ్ పోలీసులకు సవాలు విసరడం గమనార్హం.

మత్తు దిగిన తర్వాత అతని స్నేహితులకు షణ్ముఖ్ ని పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా తమ ముందుకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 337, 279ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన విష్ణు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!