నిజాంసాగర్‌లో విషాదం... కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి, 90మంది అస్వస్థత

By Arun Kumar PFirst Published Mar 26, 2019, 2:10 PM IST
Highlights

కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో కలుషిత నీరు తాగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. అలాగే మరో 90మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషయమంగా వున్నట్లు తెలుస్తోంది.

 తమ గ్రామంలో రోజు సరఫరా అయ్యే మంచినీటిని తాగిన తర్వాతే చాలామంది అస్వస్థతకు గురైనట్లు కోమలంచ గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆ నీటిని మిగతా వారు తాగకుండా జాగ్రత్త పడటంతో ఫెను ప్రమాదం తప్పిందన్నారు. అయితే అప్పటికే ఈ నీటిని తాగిన రుచిత, సత్యనారాయణ అనే ఇద్దరు చిన్నారులతో సహా సునీత అనే వివాహిత
మృతిచెందింది. మరో 90మంది గ్రామస్థుల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అయితే ఈ ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటిలో ఎవరైనా విషప్రయోగానికి పాల్పడ్డారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. అలాగే సంబంధిన అధికారులకు సమాచారం అందించి గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటి సాంపిల్స్ ని పరీక్షల నిమిత్తం సేకరించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇలా ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలామంది గ్రామస్థులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో లభించే నీటిని తాగడానికి గ్రామస్తులు జంకుతున్నారు.  
 
click me!