కూతురిపై తండ్రి అత్యాచారం

Published : Mar 26, 2019, 09:54 AM IST
కూతురిపై తండ్రి అత్యాచారం

సారాంశం

కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన  హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన  హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తె(13) నగరంలో ఓ ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వెళ్లిన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేశాడు.

నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. దీనిపై గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యతో చర్చించి బాలల పరిరక్షణ అధికారికి ఆయన సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు