గోదావరిలో చిక్కుకున్న 40మంది... స్వయంగా రంగంలోకి దిగి కాపాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 23, 2021, 10:40 AM IST
Highlights

రాష్ట్రంలోనే కాదు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి ఖని వద్ద ఇటుక బట్టీలో పనిచేసే 40మంది వరద నీటిలో 40 మంది చిక్కుకున్నారు. 

రామగుండం: తెలంగాణలో గత కొద్దిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారడంతో గేట్లను ఎత్తిని నీటికి దిగువకు వదులుతున్నారు. ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా నిండటంతో గేటెత్తి నీటిని వదులుతున్నారు. దీంతో రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరిఖని వద్ద గోదావరి నీరు జనావాసాల్లోకి చేరుకుంది. ఈ వరదనీటిలో 40మంది చిక్కుకున్నారు. 

వీడియో

గోదావరిఖని సమీపంలోని మల్కాపురం శివారులోని ఇటుకబట్టిలో పనిచేసే కూలీలు గోదావరి వరద నీటిలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా గోదావరి ప్రవాహం పెరిగి వరద నీరు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో ఇటుకబట్టిలోని కుటుంబాలు పిల్లాజెల్లలతో కలిసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఓ ఇంటిపై తలదాచుకున్నారు. ఇలా 40మంది గోదావరి వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలుసుకుని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

read more మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం... వరద నీటిలో చిక్కుకున్న 28మంది (వీడియో)
   
భారీ తాళ్ల సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారందరిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు. ఎమ్మెల్యే నడుము లోతు నీటిలోకి దిగి కూలీల పిల్లలను భుజాలపై ఎత్తుకుని బయటకు తీసుకువచ్చారు. అలాగే ఎసిపి ఉమేందర్ కూడా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

ఇక గోదావరి ఖనిలో గోదావరి వరద ప్రవాహం పెరగడంతో లారీ యార్డ్ కూడ నీట మునిగింది. దీంతో యార్డ్ చుట్టూ నీరు చేరటంతో అందులో ఉన్న డీజిల్ బంక్, ఆఫీసు నీట మునిగిపోయాయి. మేడిపల్లి ఓసిపి ప్రాజెక్ట్ కు వెళ్లే దారిపైకి వరదనీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరుకుంది.  
 

click me!