
నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం నేమరుగొమ్ములలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో మరణించారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించడం గ్రామంలో విషాదం నెలకొంది. యాదాద్రి భువనగరి జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నేమరుగొమ్ముల గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారం రోజుల వ్యవధిలో మరణించడం విషాదానికి కారణంగా మారింది.
కరోనా వైరస్ సోకడంతో తగు జాగ్రత్తలు తీసుకొంటే ఈ వైరస్ నుండి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే ప్రాణాల మీదికి వస్తోంది. కరోనా సోకిన వారంతా బలవర్ధకమైన ఆహారంతో పాటు వైద్యులు సూచించిన మందులు వేసుకొంటే వైరస్ నుండి కోలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఒకే కుటుంబంలో కరోనా సోకి పలువురు మరణించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించేందుకు గాను మందుల వివరాలతో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.