కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు వారు

Published : Jun 09, 2024, 03:17 PM ISTUpdated : Jun 09, 2024, 06:39 PM IST
కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు వారు

సారాంశం

మరో ముగ్గురు తెలుగు వారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కేంద్ర కేబినెట్ లో తెలుగు వారి సంఖ్య 5కి చేరింది.

కేంద్ర మంత్రివర్గంలో మరో ముగ్గురు తెలుగు వారికి చోటు దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు అనూహ్యంగా కేంద్ర కేబినెట్ లోకి పిలుపు అందింది. ఈ మేరకు ఆయనకు పీఎంవో నుంచి సమాచారం అందింది. ఇక, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కూడా కేంద్ర కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇవాళ (ఆదివారం) సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి వారికి సమాచారం రావడంతో వారిద్దరూ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. 

కాగా, ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమైంది.

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?