దారుణం : భార్యమీద ముగ్గురు తమ్ముళ్లతో అత్యాచారం... ఓ భర్త పైశాచికం.. !!

Published : Mar 24, 2021, 10:13 AM IST
దారుణం : భార్యమీద ముగ్గురు తమ్ముళ్లతో అత్యాచారం... ఓ భర్త పైశాచికం.. !!

సారాంశం

అన్న భార్యపై ముగ్గురు మరుదులు అత్యాచారం చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భర్త సమక్షంలోనే అతని సోదరులు తన మీద అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.

అన్న భార్యపై ముగ్గురు మరుదులు అత్యాచారం చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భర్త సమక్షంలోనే అతని సోదరులు తన మీద అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు వారి మీద కేసు నమోదు చేయాలని ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆదేశించింది. దీంతో పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాలు మేరకు, బోరబండ, ఇంద్రానగరలో నివాసముండే నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. అంతేకాకుండా తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. 

అన్న మాటలకు తమ్ములైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్ లు కూడా తోడయ్యారు. వదినను లైంగిక వేధింపులకు గురి చేసేవారు. 2017లో నర్సింహ భార్యను నిర్భందించి... తన సోదరులతో లైంగిక దాడి చేయించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!