
హైదరాబాద్: మీరు అందంగా ఉన్నారంటూ ఓ వైద్యురాలిని నిత్యం వేధిస్తున్న శాడిస్టు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వెంటాడేందుకు ఆమె కారుకు జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్)ను అమర్చాడు. అంతేకాకుండా ఆమె అడుగుజాడలను తెలుసుకునేందుకు మనుషులను కూడా పెట్టుకున్నాడు. నాలుగు నెలల నుంచి అతను వైద్యురాలిని వెంటాడుతూ వేటాడుతూ వేధిస్తున్నాడు.
అతని వేధింపులు భరించలేక వైద్యురాలు హైదరాబాదులోనిని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుట్టు రాలిపోతుందంటూ విశ్వనాథ్ అనే వ్క్తి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఉన్న వైద్యురాలిని తనతో స్నేహం చేయాలంటూ వేధించాడు. ఆమెకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఉంటున్న అపార్టుమెంటుకు ెవళ్లి నాగరాజు పేరుతో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు.
ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వైద్యురాలి కుమారుడికి బొమ్మలు ఇచ్చి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు ఆమె కుమారుడికి తండ్రి గురింిచ అబద్ధాలు చెబుతూ వచ్చాడు. దాంతో వైద్యురాలు ఫ్లాట్ ఖాళీ చేసింది. మరో ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరింది.
అయినా విశ్వనాథ్ ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె పని చేస్తున్న ఆస్పత్రికి దగ్గరలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆమె కుమారుడిని తన వద్ద వదిలిపెట్టాలని, లేకుంటే చంపేస్తాననిి బెదిరించాడు. దీంతో వైద్యురాలు తన భర్తకు చెప్పింది. హెచ్చరించేందుకు రెండు రోజుల క్రితం అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు.
విశ్వనాథ్, అతని స్నేహితుడు సురేష్ టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్ గౌడ్ ఇంట్లో ఉన్నారని అతనికి తెలిసింది. దాంతో శ్రీకాంత్ గౌడ్ వద్దకు వైద్యురాలి భర్త వెళ్లాడు. విశ్వనాథ్ విషయం ఆయనకు చెప్పాడు. అయితే, అతను వైద్యురాలి భర్తనే బెదిరించాడు. దీంతో వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్, సురేష్, పులి శ్రీకాంత్ పటేల్ గౌడ్, నాగరాజులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.