నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published : May 10, 2022, 09:50 AM ISTUpdated : May 10, 2022, 10:03 AM IST
 నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సారాంశం

నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. బైక్ పై వెళ్తున్నవారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మరణించారు.

నిజామాబాద్: జిల్లాలోని kammarpallyలో మంగళవారం నాడు జరిగిన Road Accident లో  ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు కమ్మర్ పల్లిలోని ఇందిరానగర్ కు చెందినవారుగా Police  తెలిపారు. బైక్ పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి గేటు సమీపంలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు.పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి మాణిక్యం అనే వ్యక్తి  కొద్ది రోజుల కిత్రం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బంధువులు టాటా ఏస్‌లో శనివారం సాయంత్రం చిల్లర్గ నుంచి ఎల్లారెడ్డిలో ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా  వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 26 మందిలో 9 మంది మృతిచెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

మృతులను డ్రైవర్‌ సాయిలు, చౌదర్‌పల్లి లచ్చవ్వ, చౌదర్‌పల్లి వీరమణి,  చౌదర్‌పల్లి సాయవ్వ, అంజవ్వ, పోచయ్య , గంగవ్వ, ఎల్లయ్య, ఈరమ్మగా గుర్తించారు. వ్యవసాయం, కూలిపనులు చేసుకొని బతికే నిరుపేదలే. ఈ ప్రమాదం సమాచారం అందుకన్న ఎల్లారెడ్డి సీఐ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.  మరో వైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. క్షతగాత్రులకు రూ. 50 వేలు చెల్లించారు.

ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బొలేరో వాహనం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బొలేరో వాహనంలో ప్రయాణీస్తున్న ఒకరు సజీవ దహనమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?