ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Published : Sep 19, 2019, 09:57 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

సారాంశం

 క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

జనగామ జిల్లా దేవరుప్పల పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతులు మహబూబాబాద్‌కు చెందిన పెనుగొండ గణేష్(60), పెనుగొండ సుకన్య(38), ఎండి.నజీర్(డ్రైవర్)గా గుర్తించారు. పెనుగొండ మంజూష, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu
Telangana Weathe Update: రానున్న 24 గంటల్లో చలిపంజా వాతావరణశాఖా హెచ్చరిక| Asianet News Telugu