తెలంగాణలో కరోనా: హైదరాబాదు నీలోఫర్ లో ముగ్గురు మృత్యువాత

By telugu teamFirst Published Aug 31, 2020, 10:27 AM IST
Highlights

హైదరాబాదులోని నీలోఫర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ కారణంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా వైరస్ తో మరణించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల నీలోఫర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ తో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో కరోనా వైరస్ తో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులను టెక్నీషియన్ మధులత, పారిశుద్ధ్య కార్మికురాలు రాణి, మరో ఉద్యోగి సురేష్ లుగా గుర్తించారు. 

ఇదిలావుంటే, సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగా కొనసాగుతోంది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో గత 24 గంటల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గలేదు.

గత 24 గంటల్లో తెలంగాణలో 1873 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా 24 వేల 963కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 9 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 827కు చేరుకుంది. 

గత 24 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ నుంచి 1849 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 92,837కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 31,299 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు

ఆదిలాబాద్ 17
భద్రాద్రి కొత్తగూడెం 51
జిహెచ్ఎంసీ 360
జగిత్యాల 77
జనగామ 34
జయశంకర్ భూపాలపల్లి 1
జోగులాంబ గద్వాల 28
కామారెడ్డి 25
కరీంనగర్ 180
ఖమ్మం 103
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 21
మహబూబ్ నగర్ 40
మహబూబాబాద్ 54
మంచిర్యాల 48
మెదక్ 12
మేడ్చెల్ మల్కాజిగిరి 41
ములుగు 18
నాగర్ కర్నూలు 36
నల్లగొండ 79
నారాయణపేట 1
నిర్మల్ 4
నిజామాబాద్ 94
పెద్దపల్లి 29
రాజన్న సిరిసిల్ల 23
రంగారెడ్డి 129
సంగారెడ్డి 37
సిద్ధిపేట 85
సూర్యాపేట 65
వికారాబాద్ 15
వనపర్తి 32
వరంగల్ రూరల్ 19
వరంగల్ అర్బన్ 94
యాదాద్రి భువనగిరి 21
మొత్తం కేసులు 1873

click me!