మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేరు వినగానే అందరికీ ఒకటే గుర్తొస్తది. ఆయన ఎప్పుడు పంచ్ లు, సెటైర్ లు, జోక్ లు వేస్తుంటారని అందరూ అనుకుంటారు. ఆయన అప్పుడప్పుడు కాకపుట్టించే విమర్శలు కూడా చేస్తుంటారు కానీ... ఎక్కువ శాతం జోక్స్ చేస్తుంటారు.
పొన్నాల లక్ష్మయ్య తిరుమలకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని బయటకొచ్చారు. ఇంతో మీడియా వారితో ముచ్చటించారు. స్వామి వారిని ఏం వరం కోరుకున్నారని మీడియా వాళ్లు అడిగారు. దానికి పొన్నాల అదిరిపోయే సెటైర్ వేశారు.
పాలకులకు జ్ఞానం ఇవ్వాలని తరుపతి వెంకన్నను కోరుకున్నట్లు సెలవిచ్చారు పొన్నాల. ప్రజాహితం కోసం చేపట్టే పనుల్లో భేదాభిప్రాయాలు ఉండరాదని ఆయన హితవు పలికారు.
పాలకులకు జ్ఞానం ఇవ్వాలని కోరుకున్నాను అనడంతో మరి తెలంగాణ పాలకులకా? లేక ఆంధ్రా పాలకులకా? లేక కేంద్రంలో ఉన్న పాలకులకా అన్నది మాత్రం చెప్పలేదు. ఈ సస్పెన్ష్ కొనసాగిస్తూ మీడియా సమావేశం ముగించారు పొన్నాల.