కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఒక యువకుడిపై 3డిగ్రీ ప్రయోగించాడని తనని విచక్షణారహితంగా కొట్టాడని ఆరోపిస్తూ బాదిత యువకుడు కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ ని ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.
కరీంనగర్ : గత కొన్ని రోజుల క్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రామాపురం గ్రామంలో కురుమ కులస్తులు తమ కుల దేవుడైనా బీరయ్య పట్నాలు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై విందు భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫోటో మీద వివాదం కేంద్రీకృతమయ్యింది.
undefined
తొంటి పవన్ కుమార్ అనే యువకుడు ఆ ఫోటోకు అనుచిత వ్యాఖ్యలు జోడించి స్థానిక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు చూసిన స్థానిక టిఆర్ఎస్ నాయకుడు చొప్పదండి మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన సదరు ఎస్ ఐ రాజేష్ ఐపీసీ, ఐటీ ఆక్ట్ ప్రకారం నమోదు చేసి సదరు యువకుడు పవన్ ను అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తీసుకెళ్లారు.
ఆ తరువాత యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదాడు ఎక్కడపడితే అక్కడ విచక్షణరహితంగా కొట్టారు. కాళ్లు, శరీరం పూర్తిగా వాచిపోయి.. నడకకూడా కష్టంగా మారింది. దీంతో బాధిత యువకుడు జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణను ఆశ్రయించగా స్పందించిన కమిషనర్ రూరల్ ఏసిపి కరుణాకర్ నీ విచారణకు ఆదేశించారు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సోషల్ మీడియా కథనాలపై కేసు నమోదు చేసే అవకాశం లేకున్నా సదరు ఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితుని తీవ్రంగా కొట్టడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని, బాధ్యులు ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.