తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను ఎప్పటికీ న‌మ్మ‌రు.. : మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Oct 23, 2023, 4:38 PM IST

Agriculture Minister S Niranjan Reddy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరినప్పుడు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర  ప్రజలను అవమానించారని బీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఎస్ నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం గురించి అడిగితే తెలంగాణ ఇడ్లీనా, దోసెనా అంటూ అప్పటి పాలక వర్గం నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు.
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరినప్పుడు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర  ప్రజలను అవమానించారని బీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఎస్ నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం గురించి అడిగితే తెలంగాణ ఇడ్లీనా, దోసెనా అంటూ పాలక వర్గం నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో అంధకారం నెలకొందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ హామీలు ఒక్కొక్కటిగా గల్లంతవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనమైందని విమ‌ర్శించారు.

Latest Videos

undefined

అవమానాలు, దాడుల‌ను ఎదుర్కొంటూ బీఆర్‌ఎస్ పోరాడి తెలంగాణను సాధించుకుందని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేస్తూ పరిపాలనా సంస్కరణలను చేపట్టిందని తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను కూడా తీసుకువచ్చింది. రాష్ట్రం కృష్ణా, గోదావరి నుంచి తెలంగాణ మారుమూల ప్రాంతాలకు నీటిని మళ్లించిందని తెలిపారు. "విద్య, వైద్యం, తాగునీరు, నీటిపారుదల, విద్యుత్ రంగాలను గణనీయంగా అభివృద్ధి చేశాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణ అంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదీ లేదు" అని నిరంజన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరినప్పుడు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర  ప్రజలను అవమానించారని బీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఎస్ నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం గురించి అడిగితే తెలంగాణ ఇడ్లీనా, దోసెనా అంటూ పాలక వర్గం నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. "కాంగ్రెస్ చేసిన గాయాలను ప్రజలు మరిచిపోరు. కాంగ్రెస్ హయాంలో పడ్డ బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసు" అని నిరంజన్ రెడ్డి అన్నారు. మ‌రోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

click me!