
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ మండలం పాతరల పహాడ్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.
దీంతో బాలికకు ఎలాగైనా గర్భం తీసేయించాలని అబార్షన్ మాత్రలు మింగిచగా, అవి వికటించాయి. బాలిక పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన మీద బాలిక తల్లిదండరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.