వికారాబాద్ లో దారుణం.. పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య..

Published : Mar 28, 2022, 01:36 PM IST
వికారాబాద్ లో దారుణం.. పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య..

సారాంశం

వికారాబాద్ లో కనిపించకుండా పోయిన ఓ పదో తరగతి విద్యార్థిని విగతజీవిగా లభించింది. ఆమె మీద అత్యాచారం చేసి.. ఆ తరువాత హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. 

వికారాబాద్ :  vikarabad జిల్లా పూడురులో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై హత్యాచారం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఇంటినుంచి బయటికివెళ్లిన studentపై molestation చేసి murder చేసిన ఘటన కలకలం రేపింది. బైటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేటపట్టారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక మృతదేహం లభించడంతో అసలు విషయం వెలుగు చూసింది. 

సదరు విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన తర్వాత హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్ులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మార్చి 25న ఓ పదోతరగతి బాలిక ఇలాంటి దారుణానికే గురై ప్రసవించింది.  యువకుడి బెదిరింపులకు భయపడి పలుమార్లు Sexual assaultని ఎదుర్కొన్న ఓ బాలిక చివరకు pregnant అయ్యి.. బిడ్డకు జన్మనిచ్చింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి బంధువుల కథనం ప్రకారం… మండల కేంద్రంలోని ఓ private schoolలో చదువుకుంటూ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని బంధువుల ఇంట్లో ఉంటుంది. ఓ సారి ఇంటికి Current repair లు చేయడానికి వచ్చిన పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లెకు చెందిన రాజేష్(34) బాలిక మీద కన్నేశాడు. అప్పటికే అతడికి పెళ్లయ్యింది. ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. అప్పటినుంచి బాలిక కదలికలను గమనించడం మొదలు పెట్టాడు. ఓరోజు ఒంటరిగా వెడుతున్న బాలిక వెంటపడి బలవంతంగా తీసుకెళ్లి molestation చేశాడు.

ఆ సమయంలో సెల్ ఫోన్ వీడియో తీశాడు.  ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తానని బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడు.  ఇంట్లో చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరికీ చెప్పలేదు.  కడుపులో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడింది.  కడుపు నొప్పి తీవ్రం కావడంతో పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు.  కడుపు నొప్పి తీవ్రం కావడంతో తల్లిదండ్రులు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడ బాలిక గర్భం దాచిన సంగతి బయటపడింది.  గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,  నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని రొంపిచర్ల ఎస్ ఐ  వెంకటేశ్వర్లు తెలిపారు.  నవజాత శిశువు ఆరోగ్యం సాధారణంగా ఉందని చెప్పారు. 

కాగా, job ఇస్తానని నమ్మబలికిన ఓ ప్రబుద్ధుడు (23)  నమ్మి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ గా నమోదై  ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు  తెలిపిన వివరాల ప్రకారం..  కర్నూలు జిల్లా  కొలిమిగుండ్ల  మండలానికి చెందిన ఓ యువతి (19) నాలుగేళ్లుగా దిల్సుఖ్ నగర్ సమీపంలోని చైతన్యపురి కాలనీలో టెలీకాలర్ గా పనిచేస్తుంది.

ఈనెల 7న తననుతాను సిద్ధార్థ రెడ్డిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, రూ. 18 వేల వేతనం చెల్లిస్తానని నమ్మబలికాడు. టెలీకాలర్ సంస్థ నుంచి తన ఫోన్ నెంబర్ సేకరించినట్లు చెప్పాడు. 9న కారులో దిల్షుక్నగర్ కు వచ్చి యువతిని తన వెంట తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో యువతి ఫోటోలు, గుర్తింపు కార్డు పత్రాలు తీసుకున్నాడు. ఎస్ఆర్ నగర్ లోని Oyo లాడ్జ్ కి తీసుకెళ్లి యువతి పేరిట గది బుక్ చేశాడు. 

ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే రాత్రి భోజనం చేసిన తరువాత అడ్వాన్స్ చెల్లిస్తానని నమ్మబలికాడు. లాడ్జి గదిలోకి వెళ్ళిన తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు మీడియాకు పంపుతానని బెదిరించాడు. బాధితురాలు అక్కడినుంచి ఎలాగో తప్పించుకొని వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్సార్ నగర్ ఠాణాకు బదిలీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu