‘నాన్న అంటేనే అసహ్యమేస్తుంది.. ఐ హేట్ మై డాడ్’... పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య...

Published : May 24, 2022, 08:05 AM IST
‘నాన్న అంటేనే అసహ్యమేస్తుంది.. ఐ హేట్ మై డాడ్’... పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య...

సారాంశం

తల్లి చనిపోయినప్పటినుంచి తండ్రి వేధిస్తున్నాడని.. ‘వెయిటింగ్ ఫర్ మై డెత్.. నిన్ను నాన్నా అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది’.. అంటూ ఓ పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. 

రంగారెడ్డి జిల్లా  : ‘మా నాన్న మూర్ఖుడు. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు. ఆపై Liquorనికి బానిసై మృగం గా మారాడు. నాన్నా.. అని పిలవడానికి మనసు రావడం లేదు. ఆయనను చంపాలని  లేదా చనిపోవాలని ఉంది. మూడుసార్లు ఉరివేసుకున్నా,, కానీ..  ఎవరో ఒకరు కాపాడారు. ఆయన రోజూ harass చేస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా death news అందరికీ తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ మై డెత్’ అంటూ ఓ విద్యార్థిని గతంలోనే letter రాస్తుంది. tenth class examsకు ముందు రోజు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.  

ఇన్స్పెక్టర్ రామయ్య,  బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన నర్సింహులు, లలిత దంపతులకు కుమారుడు,  పదోతరగతి చదువుతున్న కుమార్తె మనీషా (16) ఉన్నారు. లలిత ఏడాది క్రితం చనిపోయింది. భార్య చనిపోయినప్పటి నుంచి నరసింహులు తాగుడుకు బానిసయ్యాడు. ఆ మైకంలో  కుమారుడు,  కుమార్తెతో  నిత్య గొడవ పడేవాడు. ఆదివారం ఉదయం కూడా అలాగే జరిగింది. మధ్యాహ్నం తండ్రి కుమారుడికి ఫోన్ చేసి చెల్లెలు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుంది అని చెప్పాడు ఆయన ఇంటికి వచ్చి చూడగా మెడ భాగంలో కాలిన గాయాలతో మనీషా చనిపోయి ఉంది. పక్కనే మంచం పై ఉన్న పుస్తకంలో ‘ఐ హేట్ మై డాడ్’  అని నాలుగు సార్లు రాసింది. ‘మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం…’ అంటూ గతంలో రాసిన లేఖ కూడా దొరికింది.. ఈ మేరకు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా, చెన్నైలో ఆస్తికోసం కన్నతండ్రినే అతి దారుణంగా చంపిన ఘటన మే 21న వెలుగు చూసింది. property కోసం కన్న కొడుకే తండ్రిని దారుణంగా హతమార్చాడు. dead bodyని ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పడేశాడు. కొత్త పరిశ్రమకు భూమి పూజ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి, అందరూ చూస్తుండగానే ఆ drumను పాతేశాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. చెన్నైలోని వలసరవాక్కం ఆర్కాడుసాలైకు చెందిన కుమార్ రేషన్ (80) కేంద్ర రిటైర్డ్ ఉద్యోగి.  ఆయన భార్య దాక్షాయిణి ఇటీవల మరణించింది. ఆయన కుమారుడు గుణశేఖరన్ (50)తో పాటు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వీరికి వివాహాలు అయ్యాయి. కుమారుడు గుణశేఖరన్ ఇంట్లో కుమారేశన్ ఉంటున్నాడు. అదే ఇంటిపై అంతస్తులో కుమార్తె కాంచనమాల ఉంటోంది. రెండు రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో కాంచనమాల గుణశేఖరన్ భార్య, పిల్లల్ని నిలదీసింది. వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

కుమారేశన్ పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు తన పేరున రాయాలని గుణశేఖరన్ పదేపదే తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అదే సమయంలో గుణశేఖరన్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలకు బలం చేకూరింది. విచారణలో గుణశేఖరన్ హత్య చేసినట్లు తేలింది. కావేరి పాకంలో గుణశేఖరన్ చేపట్టిన టైల్స్ కటింగ్ పరిశ్రమ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో శుక్రవారం పోలీసులు గాలింపు చేపట్టారు.

నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సమయంలో గుణశేఖరన్  ఒక డ్రమ్మును పాతిపెట్టాడని అక్కడి వారు చెప్పారు. వ్యాపారం బాగా సాగేందుకు మంత్రగాడు ఇచ్చిన కొన్ని వస్తువులు డ్రమ్ములో పెట్టి పూడ్చుతున్నట్లుగా కట్టుకథ చెప్పి నమ్మించాడని తేలింది. పోలీసులు మృతదేహం భాగాలను పోస్టుమార్టంకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే